Telugu Global
Cinema & Entertainment

Kushi Movie | ఓటీటీలో ఖుషీ సంచలనం

Kushi Movie - విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఖుషి. ఈ సినిమా ఓటీటీలో కూడా పెద్ద హిట్టయింది.

Kushi Movie | ఓటీటీలో ఖుషీ సంచలనం
X

మహానటి సినిమాలో కలిసి నటించారు విజయ్ దేవరకొండ, సమంత. కానీ ఆ సినిమాలో వాళ్ల కంటే కీర్తిసురేష్, దుల్కర్ కు ఎక్కువ పేరొచ్చింది. అందులో వీళ్లిద్దరూ కలిసి నటించారనే విషయం కూడా చాలామంది మరిచిపోయారు. అలా ఆ సినిమా తర్వాత విజయ్-సమంత కలిసి నటించిన మూవీ ఖుషి. ఈసారి మాత్రం ఈ జంటను ఎవ్వరూ మరిచిపోలేరు.

ఖుషి సినిమాలో ఈ పెయిర్ చూపించిన కెమిస్ట్రీ సినిమాకు కీలకంగా మారింది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమా ఓవర్సీస్ లో బ్లాక్ బస్టర్ హిట్టవ్వగా, నైజాంలో సూపర్ హిట్టయింది. ఏపీలో మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో పెర్ ఫార్మ్ చేయలేదు.

తాజాగా ఖుషి సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అరంగేట్రం చేసింది. ప్రేక్షకులు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో దీన్ని వీక్షించడానికి వీలు కలిగింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్సయిన వాళ్లు, ఇప్పుడు ఎంచక్కా ఓటీటీలో ఖుషి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

ఇలా ఓటీటీలోకి వచ్చిన వెంటనే అలా సూపర్ హిట్టయింది ఖుషి సినిమా. ఈ సినిమాకు ప్రస్తుతం ఓటీటీలో లెక్కలేనన్ని వ్యూస్, హిట్స్ వస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. మరో 2 రోజుల్లో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ టాప్-10 మూవీస్ లోకి చేరబోతోంది.

జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కింది ఖుషి సినిమా.

First Published:  1 Oct 2023 3:34 PM GMT
Next Story