Telugu Global
Cinema & Entertainment

Kushi Movie - పాటలతో సందడి చేయనున్న ఖుషి

Kushi First Song - పాటలతో సందడి చేయబోతోంది ఖుషి సినిమా. విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోంది ఈ మూవీ.

Kushi Movie - పాటలతో సందడి చేయనున్న ఖుషి
X

విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో వస్తున్న రొమాంటిక్ మూవీ ఖుషీ. బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్ తో సెన్సిబుల్ మూవీ మేకర్ గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ నెల 9న విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ బాగుంది. విజయ్, సమంత మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలెట్ అనే విషయాన్ని పోస్టర్ లో చూపించారు. అలాగే ఇది రెండు స్వచ్ఛమైన మనసుల కథ అని తెలుస్తోంది. చుట్టూ తెల్లని మంచు కొండలు, తెల్లని పావురాల మధ్య మనసంతా స్వేచ్ఛా విహంగంలా మారింది అనేలా విజయ్ సోలో ఫోటో సైతం చాలా ఇంప్రెసివ్ గా ఉంది.

హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నుంచి ‘ నా రోజా నువ్వే’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ఈ నెల 9న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రాబోయే ఈ పాటతో మరిన్ని అంచనాలు పెరిగేలా ఈ లిరికల్ సాంగ్ ఉంటుందంట.

పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా సక్సెస్ హీరో విజయ్ దేవరకొండకు, హీరోయిన్ సమంతకు ఇద్దరికీ అత్యవసరం. అటు శివనిర్వాణకు కూడా ఈ సక్సెస్ కీలకంగా మారింది.




First Published:  4 May 2023 12:24 PM GMT
Next Story