Telugu Global
Cinema & Entertainment

ప్రస్తుతానికి రాంగ్ ఛాయిస్ లేదు

వచ్చిన ఏడాదికే వరుసపెట్టి సినిమాలు చేస్తోంది కృతి శెట్టి. మరి కథల ఎంపికలో ఈ బ్యూటీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది.

ప్రస్తుతానికి రాంగ్ ఛాయిస్ లేదు
X

కథల ఎంపిక విషయంలో ఇప్పటివరకు రాంగ్ ఛాయిస్ తీసుకోలేదంటోంది హీరోయిన్ కృతి షెట్టి. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఇప్పటివరకు అన్నీ మంచి పాత్రలే చేశానని, భవిష్యత్తులో కూడా ఇలానే చేస్తానని చెబుతోంది.

"నేను వచ్చి ఏడాదే అవుతుంది. రాంగ్ ఛాయిస్ వుంటుందని అనుకోను. నాకు వర్క్ అంటే ఇష్టం. వర్క్ లేకపోతేనే రాంగ్ అనిపిస్తుంది. ఎప్పుడు షూటింగ్ కి వెళ్దామా అనిపిస్తుంటుంది. కథ విన్నప్పుడే ఒక నమ్మకం వస్తుంది. సినిమా ప్రేక్షకులకు వినోదం పంచుతుందనిపిస్తుంది. అలా అనుకునే చేస్తాను. ఫలితంపై నాకు ఎలాంటి రిగ్రేట్ ఉండదు. ఏదైనా లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ గానే తీసుకుంటాను."

ఇలా పాత్రల ఎంపికపై స్పందించింది కృతి శెట్టి. అదృష్టం కొద్దీ తనకు అన్నీ మంచి పాత్రలే వస్తున్నాయని తెలిపింది. త్వరలోనే మాచర్ల నియోజకవర్గం సినిమాతో థియేటర్లలోకి రాబోతోంది ఈ బ్యూటీ. ఆ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని అంటోంది.

ఇక అప్ కమింగ్ మూవీస్ విషయానికొస్తే, మరోసారి నాగచైతన్య సరసన నటించబోతున్నట్టు ప్రకటించింది. బంగార్రాజులో చైతూతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ, మరోసారి చైతూతో కలిసి నటిస్తుండడం ఆనందంగా ఉందని ప్రకటించింది.

Next Story