Telugu Global
Cinema & Entertainment

Krithi Shetty | కొత్త ఇమేజ్ కోసం ప్రయత్నం

Krithi Shetty - కృతి శెట్టి కొత్త ఇమేజ్ కోసం ప్రయత్నిస్తోంది. గ్లామర్ డాల్ అనిపించుకోవాలని చూస్తోంది.

Krithi Shetty | కొత్త ఇమేజ్ కోసం ప్రయత్నం
X

కృతి శెట్టి ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఎలాంటి పాత్రలు చేస్తుందో కూడా తెలుసు. ఆమెకంటూ ఓ ఇమేజ్ ఉంది. ఇప్పుడా ఇమేజ్ ను వదిలించుకొని, సరికొత్త ఇమేజ్ కోసం ఆమె పాకులాడుతోందనే విషయం క్లియర్ గా తెలుస్తూనే ఉంది. అవును.. హాట్ ఇమేజ్ కోసం ఈ ఉప్పెన బ్యూటీ తహతహలాడుతోంది.

మొన్నటివరకు గ్యాప్ లేకుండా సినిమాలు చేసింది కృతి. ఆమె కాల్షీట్ కావాలంటే ఏడాది ఆగాల్సిందే. అలాంటి హీరోయిన్ ఇప్పుడు సగానికి సగం ఖాళీ అయిపోయింది. వరుసగా సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి మేకర్స్, ఆమెకు దూరంగా జరగడం మొదలుపెట్టారు.

దీంతో కృతిశెట్టి ఆలోచనలో పడింది. టాలీవుడ్ ను మరోసారి ఆకర్షించాలంటే ఏం చేయాలి? దీనికి వెంటనే ఆమె సమాధానం కనిబెట్టింది. సీరియస్ గా ఉండే మూసపాత్రలు కాకుండా, గ్లామర్ డాళ్ పాత్రలు కూడా పోషించాలని నిర్ణయించుకుంది. మరి దీని కోసం ఏం చేయాలి.

అనుకున్నదే తడవుగా ఫోటొషూట్స్ మొదలుపెట్టింది. కాళ్లు మొత్తం కనిపించేలా దుస్తులు ధరించడం ప్రారంభించింది. ఇంతకుముందు ఆమె ఇలాంటి దుస్తులు వేయలేదు. తనలో యాక్టింగ్ టాలెంట్ మాత్రమే కాకుండా, గ్లామర్ కూడా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తోంది. అలా తన ఇమేజ్ ను మార్చుకునే పనిలో బిజీగా ఉంది. నిజంగా ఈ ప్లాన్ వర్కవుట్ అయితే, టాలీవుడ్ లో కృతి శెట్టి మరోసారి చక్రం తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది.

కస్టడీ సినిమా తర్వాత టాలీవుడ్ కు గ్యాప్ ఇచ్చింది కృతి. 2 తమిళ సినిమాలు, ఓ మలయాళం సినిమా అంగీకరించింది. ఇప్పుడు శర్వానంద్ సినిమాకు కాల్షీట్లు ఇచ్చింది. ఈ సినిమాతో పాటు, ఆమె హాట్ లుక్స్ కూడా క్లిక్ అయితే కృతి దశతిరిగినట్టే.

First Published:  15 Oct 2023 11:10 AM GMT
Next Story