Telugu Global
Cinema & Entertainment

Custody: కృతి షెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్

Krithi Shetty first look from custody Movie released కస్టడీ మూవీ నుంచి కృతి షెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

Custody: కృతి షెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్
X

వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కస్టడీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. నాగ చైతన్య యొక్క ఫెరోషియస్ అవతార్ తో న్యూ ఇయర్ గిఫ్ట్ గా విడుదల చేసిన గ్లిమ్ప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.


ఈ సినిమా చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ రోజు మేకర్స్ ఈ చిత్రం నుండి కృతి శెట్టిని రేవతిగా పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ లో కథ ని ముందుకి నడిపించే బలమైన పాత్ర లాగా ఆలోచన రేకెత్తించే లా కృతి శెట్టి కనిపించింది.

అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో శరత్ కుమార్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.


అక్కినేని హీరో నాగ చైతన్య కెరీర్ లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది. మాస్ట్రో ఇళయరాజా మరియు అతని కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

First Published:  18 Jan 2023 4:35 PM GMT
Next Story