Telugu Global
Cinema & Entertainment

కృష్ణ వ్రింద విహారి ట్రయిలర్ రివ్యూ

నాగశౌర్య తాజా చిత్రం కృష్ణ వ్రిందా విహారి. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. ఈసారి నాగశౌర్య ఏ జానర్ సెలక్ట్ చేసుకున్నాడో మీరే చూడండి..

కృష్ణ వ్రింద విహారి ట్రయిలర్ రివ్యూ
X

నాగశౌర్య నటించిన డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'కృష్ణ వ్రింద విహారి'. త్వరలోనే థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు సంబంధించి ట్రయిలర్ రిలీజ్ చేశారు. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై అనీష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రయిలర్ లో గ్లామర్, ఎంటర్ టైన్ మెంట్ పుష్కలంగా కనిపిస్తోంది.

కృష్ణ (నాగ శౌర్య) అగ్రహారం బ్రాహ్మణ కుర్రాడు, మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి సిటీకి వస్తాడు, అక్కడ అందమైన అమ్మాయి వ్రింద (షిర్లీ సెటియా)ని కలుస్తాడు. వ్రింద ని ఇష్టపడతాడు. ఆ అమ్మాయిని ఆకర్షించడానికి కృష్ణ చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వారిద్దరూ కలసి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు. కృష్ణది సనాతన కుటుంబం, వ్రింద మోడరన్ దుస్తులు ధరించే అర్బన్ గర్ల్. ఇది కాకుండా వీరి పెళ్లికి మరో సమస్య కూడా ఎదురవుతుంది. అదేంటనే విషయాన్ని ట్రయిలర్ లో పరోక్షంగా చూపించారు.

నాగశౌర్య పెర్ఫార్మెన్స్, కామిక్ టైమింగ్ అవుట్ స్టాండింగ్ గా ఉంది. బ్రాహ్మణ గెటప్‌లో సాంప్రదాయకంగా కనిపిస్తూనే,.. ఫార్మల్స్, ఫ్యాషన్ కాస్ట్యూమ్స్‌లో ట్రెండీగా ఉన్నాడు. షిర్లీ సెటియా గ్లామరస్‌గా కనిపించింది. వీరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. రాధికా శరత్ కుమార్ తల్లిగా కనిపించగా.. వెన్నెల కిషోర్ ట్రయిలర్ లో కోమాలో ఉన్న పేషెంట్ లా కనిపించినప్పటికీ, తన ప్రజన్స్ ని చాటుకున్నాడు. రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ వినోదాన్ని పంచారు.

దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ కామెడీని బాగా హ్యాండిల్ చేయగలడు. ట్రైలర్ పూర్తిగా హ్యుమర్ తో ఆకట్టుకుంది. ఫ్యామిలీతో పాటు యువతను ఆకర్షించే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది కృష్ణ వ్రిందా విహారి సినిమా.



First Published:  11 Sep 2022 5:52 AM GMT
Next Story