Telugu Global
Cinema & Entertainment

Kiran Abbavaram: వినరో భాగ్యము విష్ణుకథ ట్రయిలర్ రివ్యూ

Vinaro Bhagyamu Vishnu Katha - కిరణ్ అబ్బవరం తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణుకథ. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ అయింది. అది ఎలా ఉందంటే..?

Kiran Abbavaram: వినరో భాగ్యము విష్ణుకథ ట్రయిలర్ రివ్యూ
X

హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం కార్నర్ లో ఉన్నాడు. అతడు తన కొత్త సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలి. లేదంటే అతడి కెరీర్ ఇబ్బందికర పరిస్థితుల్లో పడుతుంది. ఇలాంటి కీలక సమయాల్లో వస్తోంది వినరో భాగ్యము విష్ణుకథ. గీతాఆర్ట్స్2 బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన తాజాగా ట్రయిలర్ రిలీజ్ చేశారు.

సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ లాంచ్ అయింది. దర్శన (కాశ్మీర పరదేశి) అనే తెలియని అమ్మాయి నుండి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా విష్ణు (కిరణ్ అబ్బవరం) విధి మారుతుంది. అప్పుడు ఆమె అతనిని ఎలా చేరుకుందో ఈ ట్రయిలర్ లో చూపించారు. మురళీ శర్మ పాత్ర ట్రయిలర్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంది.

అదేవిధంగా, విష్ణు తన ఇరుగుపొరుగు వారితో ఇబ్బందుల్లో పడతాడు. ప్రశాంతంగా ఉండే విష్ణు జీవితం ఎందుకిలా తయారైందో తెలియాలంటే, వినరో భాగ్యము విష్ణుకథ సినిమా చూడాల్సిందే.

ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా పనితనం బాగున్నాయి. ట్రయిలర్ చూస్తే కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కినట్టు కనిపిస్తోంది. కిరణ్ ఎప్పట్లానే తన బెస్ట్ ఇచ్చాడు.

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మించాడు. కశ్మీరా హీరోయిన్ గా నటించగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. శివరాత్రి కానుకగా 17న థియేటర్లలోకి వస్తోంది ఈ మూవీ.



First Published:  8 Feb 2023 4:18 AM GMT
Next Story