Telugu Global
Cinema & Entertainment

Kiran Abbavaram: మరో సినిమా రెడీ చేసిన కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram: గీతాఆర్ట్స్2 బ్యానర్ పై కిరణ్ అబ్బవరం చేసిన సినిమా.. వినరో భాగ్యము విష్ణుకథ. ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది.

Kiran Abbavaram: మరో సినిమా రెడీ చేసిన కిరణ్ అబ్బవరం
X

కరోనా వల్ల కాస్త తగ్గాడు కానీ, లేదంటే కిరణ్ అబ్బవరం నుంచి ఈపాటికి కనీసం మరో 3 సినిమాలు అదనంగా వచ్చి ఉండేవి. అయినప్పటికీ అబ్బవరం మాత్రం తన శక్తివంచన లేకుండా సినిమాల్ని విడుదల చేస్తూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న "నేను మీకు బాగా కావాల్సినవాడ్ని" అంటూ థియేటర్లలోకి వచ్చాడు ఈ హీరో.

ఆ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. అంతలోనే కిరణ్ అబ్బవరం మరో సినిమాను రెడీ చేశాడు.రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు.

గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై "వినరో భాగ్యము విష్ణుకథ" అనే సినిమా చేశాడు కిరణ్ అబ్బవరం. ఇప్పుడీ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. తాజాగా గ్లింప్స్ కూడా విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో అబ్బవరం సరసన కశ్మీర పరదేశి హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తుండగా..మెగా నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. మురళీ కిషోర్‌ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్నాడు. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. విలేజ్‌ డ్రామా నేపథ్యంలో సాగే సినిమా ఇది.

First Published:  30 Oct 2022 11:14 AM GMT
Next Story