Telugu Global
Cinema & Entertainment

Kiran Abbavaram - కిరణ్ అబ్బవరం సినిమాకు విడుదల తేదీ ఫిక్స్

Kiran Abbavaram's Meter Movie release date - కిరణ్ అబ్బవరం కొత్త సినిమా పేరు మీటర్. ఈ సినిమా సమ్మర్ ఎట్రాక్షన్ గా రాబోతోంది.

Kiran Abbavaram - కిరణ్ అబ్బవరం సినిమాకు విడుదల తేదీ ఫిక్స్
X

ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం, మినిమం గ్యాప్ లోనే మరో సినిమాతో మనముందుకు రాబోతున్నాడు. ఈ హీరో నటిస్తున్న పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీటర్‌’.

మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో, క్లాప్‌ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై చెర్రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్‌ కాదూరి దర్శకుడు. ఏప్రిల్ 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం టీజర్‌ని ఈ నెల 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

కిరణ్ అబ్బవరం కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ఇది. ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దాడు. కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఆయన లుక్ కొత్తగా ఉంటుంది.

అతుల్య రవి హీరోయిన్. ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతం అందించాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు.. కథ-స్క్రీన్ ప్లే విభాగాల్ని కూడా రమేష్ చూసుకున్నాడు.

First Published:  5 March 2023 7:29 AM GMT
Next Story