Telugu Global
Cinema & Entertainment

Kiran Abbavaram - నెల రోజుల గ్యాప్ లో మరో సినిమా

Kiran Abbavaram's Meter Movie - మరో సినిమా రెడీ చేశాడు కిరణ్ అబ్బవరం. మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది మీటర్ మూవీ.

Kiran Abbavaram - నెల రోజుల గ్యాప్ లో మరో సినిమా
X

మొన్ననే వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు నెల రోజుల గ్యాప్ లోనే మరో సినిమాను సిద్ధం చేశాడు. ఆ సినిమా పేరు మీటర్. ఆ విశేషాలు మీకోసం..

కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీటర్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. రమేష్‌ కాదూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 7న వేసవిలో విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు నిర్మాతలు. ఈ చిత్రంలో కిరణ్‌ అబ్బవరం, పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఆయన లుక్‌, పాత్ర అన్ని కొత్తగా ఉంటాయట. కిరణ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిది.

అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. వినరో భాగ్యము విష్ణుకథ ఇచ్చిన సక్సెస్ ను మీటర్ తో కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం.

First Published:  2 March 2023 4:28 AM GMT
Next Story