Telugu Global
Cinema & Entertainment

అబ్బవరం నుంచి మరో సినిమా

వరుసపెట్టి సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం, తాజాగా మరో సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు.

అబ్బవరం నుంచి మరో సినిమా
X

కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం పేరు మీటర్. రమేష్ కాదూరి దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీమూవీ మేకర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ ఫస్ట్‌లుక్‌లో కలర్‌ఫుల్ షర్ట్‌తో.. ఫుల్‌ మాస్ లుక్‌తో కనిపిస్తున్నాడు హీరో కిరణ్. ఈ లుక్‌తో పాటు టైటిల్ కూడా అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. మోషన్‌ పోస్టర్‌కు సాయి కార్తీక్ అందించిన మాస్ బ్యాగ్రౌండ్ స్కోర్ చూస్తుంటే ఇది పక్కా కమర్షియల్ పైసా వసూల్ చిత్రంగా అనిపిస్తోంది.

ఈ చిత్రం కిరణ్ అబ్బవరం ఇమేజ్‌ను రెట్టింపు చేసే విధంగా ఉంటుందని చెబుతోంది చిత్ర బృందం. అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే కిరణ్ అబ్బవరం చేతిలో నేను మీకు బాగా కావాల్సిన వాడ్ని, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలున్నాయి. ఈ రెండూ కచ్చితంగా ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి వస్తాయి. మీటర్ సినిమా కూడా ఈ ఏడాది వస్తే, రిలీజుల విషయంలో అబ్బవరం రికార్డ్ సృష్టించినోడు అవుతాడు.



First Published:  16 July 2022 2:55 AM GMT
Next Story