Telugu Global
Cinema & Entertainment

Rules Ranjan | తన సినిమా కథ చెప్పేసిన కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram - విడుదలకు ముందే రూల్స్ రంజన్ స్టోరీ లైన్ చెప్పేశాడు హీరో కిరణ్ అబ్బవరం. ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటంటే..?

Rules Ranjan | తన సినిమా కథ చెప్పేసిన కిరణ్ అబ్బవరం
X

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హాట్ హీరోయిన్ నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా రూల్స్ రంజన్. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. విడుదల నేపథ్యంలో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడాడు కిరణ్ అబ్బవరం. సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అంతేకాదు, స్టోరీలైన్ కూడా చెప్పేశాడు.

"మనో రంజన్ ఒక అమాయకపు వ్యక్తి. రాజా వారు రాణి గారు సినిమా టైపులో కాస్త సాఫ్ట్‌గా ఉంటాడు. అతని ఇంటి చుట్టుపక్కల చాలా జాగ్రత్తగా, ఆప్యాయంగా కొంతమంది పిల్లలు పెరుగుతారు. వారికి అన్ని సుఖాలు, సౌకర్యాలు ఉన్నాయి. మనోరంజన్ ఆ విధమైన పెంపకం ఉన్న వ్యక్తి. తనపై ఎవరైనా నిందలు వేసినా ఎలా స్పందించాలో కూడా తనకు తెలియదు. అతను కొన్ని పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, తనను కంట్రోల్ చేసే వ్యక్తులపై రూల్స్ పెడతాడు. సినిమాలో అది అత్యంత వినోదాత్మకమైన భాగం. అంతా సజావుగా సాగిపోతున్న టైంలో అతని జీవితంలోకి ఓ అమ్మాయి ప్రవేశిస్తుంది. మనోరంజన్ రూల్స్ రంజన్‌గా ఎలా మారతాడు? అతని జీవితం ఎంత వినోదాత్మకంగా సాగుతుంది అనేది సినిమాలో చూస్తాం."

ఇలా సినిమా స్టోరీని బ్రీఫ్ గా చెప్పేశాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమాలో ఫుల్ కామెడీ ఉంటుందని చెబుతున్నాడు. దాదాపు అన్ని పాత్రలు కామెడీ పండిస్తాయంటున్నాడు.

"వెన్నెల కిషోర్, హైపర్ ఆది లాంటి నటులతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నాను. నా మునుపటి చిత్రాలన్నీ సబ్జెక్ట్‌తో నడిచేవి, కామెడీకి తక్కువ స్కోప్ ఉండేవి. రూల్స్ రంజన్ కథలో సందర్భానుసారం కామెడీ ఉంటుంది. మీకు తెలియకుండానే అన్ని పాత్రలతో ప్రేమలో పడతారు. సినిమా అంతా కూడా డ్రామా కంటే ఎక్కువగా కామెడీ నిండి ఉంటుంది."

రూల్స్ రంజన్ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కుమారుడు రత్నం కృష్ణ దర్శకత్వం వహించాడు. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై మురళీకృష్ణ వేమూరి, దివ్యాంగ్ లావానియా నిర్మించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సుబ్బరాజు, వైవా హర్ష, హైపర్ ఆది, కీలక పాత్రలు పోషించారు.

First Published:  5 Oct 2023 5:05 PM GMT
Next Story