Telugu Global
Cinema & Entertainment

తన సినిమాకు తానే డైలాగ్స్ రాసుకున్న హీరో

కిరణ్ మరోసారి డైలాగ్ రైటర్ అవతారం ఎత్తాడు. నేను మీకు బాగా కావాల్సిన వాడ్ని సినిమాకు తనే మాటలు రాసుకున్నాడు.

తన సినిమాకు తానే డైలాగ్స్ రాసుకున్న హీరో
X

కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆల్ రౌండర్ గా తన ప్రతిభ చాటుతూనే ఉన్నాడు కిరణ్ అబ్బవరం. రాజా వారు-రాణిగారుతో హీరోగా పరిచయమైన ఈ నటుడు, కేవలం యాక్టింగ్ కే పరిమితం కాకుండా.. కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్ లాంటి విభాగాల్లో తన టాలెంట్ చూపిస్తున్నాడు. ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాకు అన్నీతానై వ్యవహరించిన ఈ హీరో, ఇప్పుడు 'నేను మీకు బాగా కావాల్సినవాడ్ని' అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.

ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాను తెరకెక్కించిన శ్రీధర్ గాదె ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కేవలం హీరోగా నటించడమే కాకుండా.. సినిమాకు డైలాగ్స్ కూడా అందించాడు కిరణ్ అబ్బవరం. ఈ విషయాన్ని కిరణ్ స్వయంగా బయటపెట్టాడు.

"హీరోగా సెటిల్ అవుతున్న టైంలో ఇలాంటి కథ నా కెరియర్ కు చాలా బూస్టప్ ఇస్తుంది.ఇందులో 2 షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాను. ఇప్పటివరకు రెండు షేడ్స్ ఉన్న పాత్ర నేను చేయలేదు. అందుకే ఈ కథ డిమాండ్ మేరకు డైలాగ్ వెర్షన్ నేనే రాశాను. ఇందులో నాది బాబా భాస్కర్ ల ట్రాక్ చాలా బాగుంటుంది."

ఇలా 'నేను మీకు బాగా కావాల్సినవాడ్ని' సినిమాకు డైలాగ్స్ రాసిన విషయాన్ని బయటపెట్టాడు కిరణ్ అబ్బవరం. రేపు ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. దాదాపు 500 స్క్రీన్స్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమౌతున్నారు.

First Published:  15 Sep 2022 10:23 AM GMT
Next Story