Telugu Global
Cinema & Entertainment

రీ రిలీజ్‌లోనూ పోటా పోటీ..ఖుషి, ఒక్కడు ట్రైలర్లకు లక్షల్లో వ్యూస్

Kushi and Okkadu Movies Re Release: డిసెంబర్ 31 సందర్భంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి, మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ట్రైలర్లను కూడా విడుదల చేయగా అవి ప్రస్తుతం యూట్యూబ్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

Kushi and Okkadu Movies Re Release
X

రీ రిలీజ్‌లోనూ పోటా పోటీ..ఖుషి, ఒక్కడు ట్రైలర్లకు లక్షల్లో వ్యూస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు భారీ స్టార్ డం తీసుకొచ్చిన సినిమా ఖుషి అయితే, సూపర్ స్టార్ మహేష్ బాబును స్టార్‌ను చేసిన మూవీ ఒక్కడు. 2001లో విడుదలైన ఖుషి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని ఆకాశానికి తీసుకెళ్ళింది. పవన్ కళ్యాణ్ అప్పటివరకు సాధించిన విజయాలు ఒకెత్తయితే ఖుషి మరో ఎత్తు. యూత్‌లో పవన్‌కు బీభత్సమైన ఫాలోయింగ్ తీసుకొచ్చింది ఈ మూవీ.

ఇక మహేష్ బాబు కెరీర్‌లో రాజకుమారుడు, మురారి వంటి హిట్లున్నా..మాస్, క్లాస్‌లో భారీ ఇమేజ్ తెచ్చిన సినిమా మాత్రం ఒక్కడునే. వందకు పైగా కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఈ మూవీ. కాగా ఇటీవల రీ రిలీజుల ట్రెండ్ తీసుకొచ్చిన సినిమా మహేష్ నటించిన పోకిరి. రీ రిలీజ్‌లో ఈ మూవీ దాదాపు రెండు కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత విడుదలైన పవన్ కళ్యాణ్ జల్సా సినిమా అయితే ఏకంగా మూడు కోట్ల వసూళ్లు సాధించి.. రీ రిలీజ్ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

ఆ తర్వాత ఈ రెండు సినిమాలను చూసి వరుసగా చెన్నకేశవరెడ్డి, వర్షం, రెబల్, బిల్లా వంటి సినిమాలను రీ రిలీజ్ చేసినప్పటికీ వాటికి బాక్సాఫీస్ వద్ద అంత ఆదరణ లభించలేదు. ఇప్పుడు డిసెంబర్ 31 సందర్భంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి, మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ట్రైలర్లను కూడా విడుదల చేయగా అవి ప్రస్తుతం యూట్యూబ్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

ఒక రోజు కిందట విడుదలైన ఖుషి ట్రైలర్ యూట్యూబ్‌లో టాప్ 7లో ట్రెండ్ అవుతూ ఇప్పటిదాకా సుమారు 6 లక్షల 70 వేల వ్యూస్ సాధించింది. ఇక రెండు రోజుల కిందట విడుదలైన ఒక్కడు ట్రైలర్ ఏడున్నర లక్షల వ్యూస్ సాధించి యూట్యూబ్ లో టాప్ 22 లో ట్రెండ్ అవుతోంది. మొదటిసారి విడుదలైన సమయంలో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ రెండు సినిమాలు రీ రిలీజ్‌లోనూ ప్రేక్షకుల్లో మంచి బజ్ తెచ్చుకుని సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక డిసెంబర్ 31 విడుదలయ్యే ఈ రెండు సినిమాలు ఎంత మేరకు కలెక్షన్లు సాధిస్తాయో చూడాలి.

First Published:  27 Dec 2022 8:44 AM GMT
Next Story