Telugu Global
Cinema & Entertainment

Khushbu - పవన్, విజయ్ సినిమాలపై ఖుష్బూ రియాక్షన్

Khushbu Movies - పవన్ కల్యాణ్, విజయ్ తో కలిసి చేసిన సినిమాలపై నటి ఖుష్బూ రియాక్ట్ అయ్యారు. తన పాత్రలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు

Khushbu - పవన్, విజయ్ సినిమాలపై ఖుష్బూ రియాక్షన్
X

ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. రాజకీయాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు మనసుకు నచ్చిన పాత్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె పవన్ కల్యాణ్, విజయ్ సినిమాల్లో కూడా నటించారు. ఈ రెండు సినిమాలతో రెండు కొత్త అనుభవాలు నేర్చుకున్నారు. అవేంటో ఆవిడ మాటల్లోనే..

"అజ్ఞాతవాసి లో మంచి పాత్ర పోషించాను. కానీ నన్ను, పవన్ కల్యాణ్ తల్లిలా ప్రేక్షకులు అంగీకరించలేదు అనుకుంటాను. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. వారిసు(వారసుడు)లో 18 నిమిషాల నిడివి గల బలమైన పాత్రను పోషించాను.. కానీ సినిమా నిడివి ఎక్కువ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నా పాత్రను తొలగించారు. తెలుగులో ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలని ఉంది. పాత్రకి ప్రాధాన్యత ఉంటే నిడివి తక్కువ అయినా నటించడానికి సిద్ధంగా ఉన్నాను."

ఇలా పవన్, విజయ్ సినిమాలపై స్పందించారు ఖుష్బూ. ప్రస్తుతం తన మనసుకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తున్నానని, అందుకే తక్కువ సినిమాల్లో నటిస్తున్నానని చెప్పుకొచ్చిన ఖుష్బూ, రామబాణంలో మంచి పాత్ర చేసినట్టు ప్రకటించారు.

ప్రేక్షకులు సినిమా చూసే కోణం మారిందంటున్న ఖుష్బూ, మనం చేసే పాత్రల్లో డెప్త్ ను అంతా గమనిస్తున్నారని అన్నారు. అందుకే ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకునే పాత్రలు పోషించాలని, అలాంటి పాత్రనే రామబాణం లో చేశానని అన్నారు.

First Published:  20 April 2023 1:35 AM GMT
Next Story