Telugu Global
Cinema & Entertainment

థియేటర్లలో బ్లాక్ బస్టర్.. టీవీల్లో యావరేజ్

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాకు, బుల్లితెరపై మాత్రం మిశ్రమ స్పందన దక్కింది. టీవీల్లో కూడా అఖండ విజయం సాధిస్తుందనుకున్న ఈ సినిమా యావరేజ్ రేటింగ్ తో సరిపెట్టుకుంది.

థియేటర్లలో బ్లాక్ బస్టర్.. టీవీల్లో యావరేజ్
X

థియేటర్లలో హిట్టయిన అన్ని సినిమాలకూ టీవీల్లో రేటింగ్స్ రావు. అలా అని థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలు, టీవీల్లో కూడా ఫ్లాపులుగా మిగలవు. ఈ విషయంలో థియేట్రికల్ ఆడియన్స్, బుల్లితెర వీక్షకుల మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉంది. తాజాగా కేజీఏఫ్2 సినిమా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయింది కేజీఎఫ్ ఛాప్టర్-2. కానీ ఈ సినిమా టీవీల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానెల్ లో ఈ సినిమాను ప్రసారం చేస్తే కేవలం 9.15 టీఆర్పీ వచ్చింది. రాధేశ్యామ్ లాంటి కొన్ని పెద్ద సినిమాలతో పోల్చి చూస్తే ఇదేమంత దారుణమైన రేటింగ్ కాదు. అలా అని సూపర్ హిట్ అనిపించే నంబర్ కూడా కాదు.

నిజానికి ఈ సినిమాకు భారీ రేటింగ్ ఆశించింది సదరు ఛానెల్. మంచి టైమింగ్ చూసి మరీ సినిమాను టెలికాస్ట్ చేసింది. కానీ అదే టైమ్ లో ప్రత్యర్థి ఛానెళ్లలో పుష్ప సినిమా పడింది. దీంతో కేజీఎఫ్2కు రేటింగ్ పడిపోయింది. థియేటర్లలో ప్రత్యర్థి సినిమాల్ని మట్టికరిపించిన ఈ మూవీ, బుల్లితెరపై మాత్రం పుష్ప హవాను అడ్డుకోలేకపోయింది.

First Published:  3 Sep 2022 9:10 AM GMT
Next Story