Telugu Global
Cinema & Entertainment

Akka | కీర్తిసురేష్, రాధికా అప్టే కొత్త వెబ్ సిరీస్

Akka Web series - కీర్తిసురేష్ రాధికా ఆప్టే కలిసి ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు. దీనికి అక్కా అనే టైటిల్ పెట్టారు.

Akka | కీర్తిసురేష్, రాధికా అప్టే కొత్త వెబ్ సిరీస్
X

యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై వెబ్ సిరీస్ రాబోతోంది. పీరియాడిక్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో కార్తిసురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అటు నార్త్, ఇటు సౌత్ కు చెందిన ఇద్దరు విలక్షణ హీరోయిన్లు కలిసి ఓ వెబ్ సిరీస్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి 'అక్క' అనే పేరుపెట్టారు.

ఆదిత్య చోప్రా నిర్మాతగా ధర్మరాజ్ శెట్టి అనే డెబ్యూ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నారు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూ కూడా, ‘అక్క’ ప్రాజెక్ట్‌ నచ్చి, ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు నిర్మాత ఆదిత్య చోప్రా. ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా చాలా హైలెట్స్ ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి సీక్రెట్‌గానే ఉంచుతున్నారు.

రీసెంట్‌గా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్‌ను వైఆర్‌ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ తమ మొదటి వెబ్ సిరీస్‌గా రూపొందించింది. ఇందులో మాధవన్, కె.కె.మీనన్, దివ్యేందు శర్మ, బాబిల్ ఖాన్ తదితరులు నటించారు. 1984 భోఫాల్ గ్యాస్ దుర్ఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించి రిలీజ్ చేయగా వరల్డ్ వైడ్ టాప్ టెన్ వెబ్ సిరీస్‌ల్లో ఒకటిగా నెట్‌ఫ్లిక్స్‌లో ఇది ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు అదే ఊపులో అక్క వెబ్ సిరీస్ ను ప్రకటించింది వైఆర్ఎఫ్ సంస్థ.

ఇటు కీర్తిసురేష్, అటు రాధికా ఆప్టే ఇద్దరికీ వెబ్ సిరీస్ లు కొత్తకావు. ఇద్దరూ గతంలో ఓటీటీలో చేశారు. పైగా ఇద్దరికీ థ్రిల్లర్స్ చేసిన అనుభవం ఉంది. కాబట్టి, ఈసారి వీళ్లిద్దరూ కలిసి ఎలాంటి థ్రిల్ అందించబోతున్నారో చూడాలి.

First Published:  25 Nov 2023 2:43 PM GMT
Next Story