Telugu Global
Cinema & Entertainment

Keedaa Cola | మరోసారి మెప్పించిన తరుణ్ భాస్కర్

Keedaa Cola - లాంగ్ గ్యాప్ తర్వాత తరుణ్ భాస్కర్ నుంచి మరో సినిమా వస్తోంది. పేరు కీడా కోలా. తాజాగా ట్రయిలర్ రిలీజైంది.

Keedaa Cola | మరోసారి మెప్పించిన తరుణ్ భాస్కర్
X

తన తొలి రెండు చిత్రాలు ‘పెళ్లి చూపులు’, 'ఈ నగరానికి ఏమైంది' బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రసంశలు అందుకున్న యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా'తో వస్తున్నాడు. బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ అందించిన దర్శకుడు న్యూ కమ్మర్స్ తో కలసి సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ఒక యూనిక్ ఎంటర్ టైనర్ ని ఎంచుకున్నారు. తాజాగా ఈ సిిమా ట్రయిలర్ లాంచ్ చేశారు. రానా దగ్గుబాటి చేతుల మీదుగా రిలీజైన ఈ థియేట్రికల్ ట్రైలర్‌ ఎలా ఉందో చెక్ చేద్దాం..

తరుణ్ భాస్కర్ కథ-కథనంలో ప్రత్యేకమై శైలి ఉంటుంది. ట్రైలర్ కట్ చేయడంలో కూడా తన మార్క్ చూపించాడు. కీడా కోలా ట్రైలర్ ఒక క్రేజీ రైడ్. ఇందులో 9 ప్రధాన పాత్రలు ఉన్న ఈ కథ కీడా, బార్బీ చుట్టూ తిరుగుతుంది. కీడా చుట్టూ కొంత ఉత్కంఠ ఉన్నప్పటికీ అది రివిల్ చేయలేదు, బార్బీ వాల్యూ మిలియన్లు. మిగిలిన ప్రధాన పాత్రలు హిలేరియస్ గా ఉన్నాయి.

వరదరాజులు తాతగా బ్రహ్మానందం, వాస్తుగా చైతన్యరావు, లంచంగా రాగ్ మయూర్, నాయుడుగా తరుణ్, సికిందర్‌గా విష్ణు, జీవన్‌గా జీవన్‌కుమార్, సీఈవోగా రవీంద్ర విజయ్, షాట్స్‌గా రఘురామ్ అందరూ సీరియస్‌గా కనిపించినా వారు చేసే పనులు మాత్రం నవ్వు తెప్పిస్తున్నాయి. అదే కీడా కోలా ప్రత్యేకత.

ట్రయిలర్ కు వివేక్ సాగర్ అందించిన బీజీఎం డిఫరెంట్ గా ఉంది. అన్నీ తానై తరుణ్ భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. తరుణ్ ఫ్రెండ్స్ కొంతమంది నిర్మాతలుగా మారి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. తరుణ్ ఇందులో ఓ ప్రత్యేక పాత్ర కూడా పోషించాడు. సినిమా రానాకు బాగా నచ్చింది. అందుకే అతడు కీడాకోలాకు ప్రజెంటర్ గా మరాడు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.

First Published:  19 Oct 2023 2:20 AM GMT
Next Story