Telugu Global
Cinema & Entertainment

Keedaa Cola | తరుణ్ భాస్కర్ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్

Keedaa Cola - అన్నీ తానై తరుణ్ భాస్కర్ తీసిన సినిమా కీడా కోలా. ఈ సినిమా విడుదల తేదీ లాక్ అయింది.

Keedaa Cola | తరుణ్ భాస్కర్ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్
X

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ యూత్ ను మెప్పించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హీరో రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడు.

'కీడా కోలా' ఇప్పటికే ఫస్ట్ లుక్స్, టీజర్ తో క్యురియాసిటీని పెంచింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. నవంబర్ 3న 'కీడా కోలా' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు.. ప్రధాన తారాగణం అంతా సీరియస్ లుక్స్ లో కనిపించడం ఆసక్తికరంగా ఉంది.

విజి సైన్మా మొదటి ప్రొడక్షన్ కీడా కోలా. తరుణ్ భాస్కర్ తో పాటు దాదాపు ఆరుగురు కలిసి ఈ బ్యానర్ స్థాపించారు. తరుణ్ భాస్కర్ అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నాడు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఏజే ఆరోన్ డీవోపీగా, ఉపేంద్ర వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

ఎప్పట్లానే ఈ సినిమాకు కథ, మాటలు, దర్శకత్వ విభాగాల్ని తరుణ్ భాస్కర్ చూసుకున్నాడు. అంతేకాదు, ఇందులో అతడు ఓ కీలక పాత్ర కూడా పోషించాడు. బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్, చైతన్యరావు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ అవుతుందంటున్నాడు దర్శకుడు.

First Published:  15 Sep 2023 5:57 PM GMT
Next Story