Telugu Global
Cinema & Entertainment

Keedaa Cola | తరుణ్ భాస్కర్ నుంచి డిఫరెంట్ మూవీ

Keedaa Cola Movie - తరుణ్ భాస్కర్ కొత్త సినిమా కీడా కోలా. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది.

Keedaa Cola | తరుణ్ భాస్కర్ నుంచి డిఫరెంట్ మూవీ
X

మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నుంచి వస్తున్న క్రైమ్ కామెడీ 'కీడా కోలా'. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో పాత్రల ఫస్ట్ లుక్స్ ను ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా ఆ పాత్రలతో టీజర్ ను రిలీజ్ చేశారు.

ఒక కోలా బాటిల్‌ లో ఎదో కదులుతూ ఉంటుంది. అది ఏంటని బ్రహ్మానందం అడిగితే? చైతన్యరావు ద్రాక్ష అని చెబుతాడు. ఇద్దరి మధ్య సెటైరికల్ పంచ్‌లతో టీజర్‌ హిలేరియస్ గా మొదలౌతుంది. తర్వాత గ్యాంగ్ ఆఫ్ మిస్‌ఫిట్స్ యాక్షన్ లోకి దిగడం ఇంకా ఆసక్తికరంగా ఉంది. టీజర్ సినిమాలోని పాత్రలు, వారి వరల్డ్ ని పరిచయం చేసింది. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంటూ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది.

టీజర్‌లో కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం వినోదాత్మక పాత్రలో కనిపించగా, తరుణ్ భాస్కర్‌ లోకల్ డాన్‌గా కనిపించడం సర్ ప్రైజ్ చేసింది. చైతన్య రావు, రఘురామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు, రాగ్ మయూర్ ఇతర ముఖ్య తారాగణం. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంది.

కీడా కోలా విజి సైన్మా మొదటి ప్రొడక్షన్. ఓ ఐదుగురు ఔత్సాహికులు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కథ, డైరక్షన్ తో పాటు.. స్క్రీన్ ప్లే కూడా తరుణ్ భాస్కర్ దే. ఇవి కాకుండా సినిమాలో ఓ కీలక పాత్ర కూడా పోషించాడు.

కీడా కోలా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేస్తారు.



First Published:  29 Jun 2023 3:15 AM GMT
Next Story