Telugu Global
Cinema & Entertainment

కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ ను చంపేస్తామని బెదిరింపులు..!

తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్ అయిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ లను చంపుతా మంటూ బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తి వారిని చంపేస్తామని బెదిరించాడు.

Katrina Kaif, Vicky Kaushal
X

సెలబ్రిటీలను చంపుతా మంటూ తరచూ ఫోన్ కాల్స్, లేఖలు, బెదిరింపులు రావడం వారిని ఇబ్బందులకు గురి చేస్తోంది. మందుబాబులు, ఆకతాయిలు ఇలాంటి చిల్లర పనులకు పాల్పడుతుంటారు. వారు చేసే పనుల వల్ల సెలబ్రిటీలకు వారు చేసుకునే పనులకు ఇబ్బంది తలెత్తడమే కాకుండా, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అవస్థలు పడాల్సి వస్తోంది. కొన్ని నెలల కిందట తమిళనాడులో అక్కడి అగ్రహీరోలు అయిన రజనీ కాంత్, విజయ్, అజిత్ ఇళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత పోలీసుల విచారణలో అది అంతా ఉత్తిదే అని తేలింది.

తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్ అయిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ లను చంపుతా మంటూ బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తి వారిని చంపేస్తామని బెదిరించాడు. కత్రినాకైఫ్ దంపతులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ' ఒక వ్యక్తి కొద్ది రోజుల నుంచి నన్నూ, కత్రినా కైఫ్ ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తరచూ చంపుతానంటూ మెసేజ్ లు పెడుతున్నాడు. కత్రినా కైఫ్ ను కూడా వేధిస్తున్నాడు.' అని విక్కీ కౌశల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కత్రినాకైఫ్ దంపతులను బెదిరించిన వ్యక్తి ఎవరో కనుగొనేందుకు రంగంలోకి దిగారు. బాలీవుడ్ లో సెలబ్రిటీలకు బెదిరింపు కాల్స్ రావడం ఎక్కువే. ఇటీవలికాలంలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ ను, ఆయన తండ్రిని చంపేస్తామని వారు ఆ లేఖల్లో పేర్కొన్నారు. దీంతో సల్మాన్ ఖాన్ పోలీసులను ఆశ్రయించి, తనకు ప్రాణహాని ఉందని తెలియజేశాడు. ఆత్మరక్షణ కోసం లైసెన్సు గన్ కావాలని ముంబై పోలీసులకు దరఖాస్తు కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ దంపతులకు బెదిరింపులు రావడంతో బాలీవుడ్ లో కలకలం రేగింది.

First Published:  25 July 2022 9:27 AM GMT
Next Story