Telugu Global
Cinema & Entertainment

Katha Venuka Katha - కథ వెనుక కథ టీజర్ రివ్యూ

Katha Venuka Katha movie - సునీల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన చిత్రం కథ వెనుక కథ. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదల అయింది.

Katha Venuka Katha - కథ వెనుక కథ టీజర్ రివ్యూ
X

దండమూడి బాక్సాఫీస్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అవ‌నింద్ర కుమార్ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.


75 సెకన్ల కథ వెనుక కథ టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ఓ యంగ్ డైరెక్ట‌ర్ (విశ్వంత్) మ‌రో పాత్ర‌కు ఓ క్రైమ్ క‌థ‌ను చెప్ప‌టంతో టీజ‌ర్ స్టార్ట్ అవుతుంది. చాలా వ‌ర‌కు మిస్సింగ్ కేసులుగా న‌మోదు అవుతున్న అమ్మాయిల‌ను సిటీలో ఎవ‌రో హ‌త్య చేస్తుంటారు. ఇంత భ‌యంక‌ర‌మైన హ‌త్య‌ల‌ను చేస్తున్న హంత‌కుడెవ‌రో పోలీసుల‌కు అంతు చిక్క‌దు.


దీంతో వారు కేసుని స‌త్య (సునీల్‌) అనే సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌కి అప్ప‌గిస్తారు. సిటీలో జ‌రుగుతున్న హ‌త్య‌ల‌కు ఓ వ్య‌క్తి కార‌ణం కాద‌ని, ఓ గ్యాంగ్ క‌లిసి ఈ హ‌త్య‌ల‌ను చేస్తుంద‌ని స‌త్య‌కు తెలుసుకుంటాడు. మ‌రి ఈ విష‌యాన్ని స‌త్య ఎలా క‌నుక్కున్నాడు.. అత‌ను టీజ‌ర్‌లో చెప్పిన‌ట్లు మిస్ అయిన ఓ పాయింట్ ఏంటి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే క‌థ వెనుక క‌థ సినిమా చూడాల్సిందే.


టీజ‌ర్‌లో పోలీసుల ఇన్వెస్టిగేష‌న్ ప్ర‌కారం విశ్వంత్ పాత్ర ప‌జిలింగ్‌గా అంద‌రూ అనుమాన ప‌డేలా క‌నిపిస్తుంది. మ‌రో వైపు ఇదే క్యారెక్ట‌ర్ 2019లో జ‌రిగిన దిశ రేప్, మ‌ర్డ‌ర్ కేసు గురించి చెప్ప‌టం అప్పుడు ప్ర‌జ‌ల్లో నుంచి వ‌చ్చిన ఎమోష‌న‌ల్ రియాక్ష‌న్స్‌, దానికి పోలీసులు చూపించిన యాక్ష‌న్ గురించి ప్ర‌స్తావ‌న ఉంటుంది. సునీల్‌, విశ్వంత్ పాత్ర‌లు చాలా ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తున్నాయి. పోలీసులు చేసే ఇంట‌రాగేష‌న్‌, ప్రొసీజ‌ర్స్‌, పోర్ష‌న్స్‌, బ్యాక్‌డ్రాప్ అనేది చాలా ఇంట్ర‌స్టింగ్‌గా అనిపిస్తుంది.



First Published:  22 Feb 2023 3:08 AM GMT
Next Story