Telugu Global
Cinema & Entertainment

సర్దార్ నుంచి అప్ డేట్ వచ్చేసింది

కార్తి హీరోగా నటిస్తున్న డిఫరెంట్ మూవీ సర్దార్. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంబంధించి చాలా అప్ డేట్స్ వచ్చాయి

సర్దార్ నుంచి అప్ డేట్ వచ్చేసింది
X

హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సర్దార్. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తోంది.

సర్దార్‌లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, రజిషా విజయన్ సెకెండ్ హీరోయిన్ గా నటిస్తోంది. చుంకీ పాండే కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇటివలే విడుదలైన 'సర్దార్' టీజ‌ర్‌ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్‌లో కార్తి, 6 విభిన్న గెటప్స్ , బ్రిలియంట్ ఫెర్ ఫార్మెన్స్, వైవిధ్యమైన కథ సినిమాపై భారీ అంచనాలని పెంచింది. ఇప్పుడీ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

దీపావళి కానుకగా తెలుగు, తమిళంలో సర్దార్ సినిమా రిలీజ్ కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ కాబట్టి, ఈసారి కార్తి సినిమాకు భారీ ఎత్తున స్క్రీన్స్ దొరికే అవకాశం ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.






First Published:  8 Oct 2022 6:38 AM GMT
Next Story