Telugu Global
Cinema & Entertainment

సర్దార్ ట్రయిలర్ రివ్యూ

కార్తి తాజా చిత్రం సర్దార్. ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ అయింది. సినిమా కథపై ఓ అవగాహన కల్పించింది.

సర్దార్ ట్రయిలర్ రివ్యూ
X

హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ ల తాజా చిత్రం 'సర్దార్'. టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ కూడా రిలీజైంది. ఈ ట్రయిలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

కార్తిని మారువేషంలో సర్దార్‌గా, పబ్లిసిటీ క్రేజ్ వున్న ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాష్‌గా ద్విపాత్రాభినయంలో పరిచయం చేస్తూ ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. సైనిక సమాచారం ఉన్న ఒక సీక్రెట్ ఫైల్ మిస్ అవుతుంది. రా (RAW) సిబిఐతో సహా ప్రతి ఒక్కరూ దాని కోసమే వెదుకుతుంటారు. చివరిగా అది ఎవరికి చిక్కింది, అందులో ఉన్న రహస్యాలు ఏంటనేది ఇందులో స్టోరీ. ట్రైలర్ చూస్తే ఇదే అర్ధమౌతోంది.

పిఎస్ మిత్రన్ అద్భుత కథనం, డివోపీ జార్జ్ సి విలియమ్స్ బ్రిలియంట్ విజువల్స్, జివి ప్రకాష్ కుమార్ అవుట్ స్టాండింగ్ లైవ్ స్కోర్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. కార్తి పాత్ర, అభినయం చాలా బాగున్నాయి. విభిన్న షేడ్స్ ఉన్న పాత్రను అద్భుతంగా పోషించాడు. రాశి ఖన్నా, రజిషా విజయన్, లైలా కూడా ట్రైలర్‌లో కనిపించి అంచనాలు పెంచారు.

ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ లక్ష్మణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాడు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలౌతుంది.



First Published:  16 Oct 2022 1:17 PM GMT
Next Story