Telugu Global
Cinema & Entertainment

Japan Movie Trailer | జపాన్ మూవీ ట్రయిలర్ ఎలా ఉందంటే..?

Japan Telugu Movie Trailer | కార్తి హీరోగా నటిస్తున్న 25వ చిత్రం జపాన్. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది.

Japan Movie | జపాన్ మూవీ ట్రయిలర్ ఎలా ఉందంటే..?
X

Japan Movie | జపాన్ మూవీ ట్రయిలర్ ఎలా ఉందంటే..?

Japan Telugu Movie Trailer | వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ 25వ చిత్రం 'జపాన్‌' తో ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధమయ్యాడు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు.

ఇటివలే విడుదలైన జపాన్ టీజర్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చెన్నైలో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ లో జపాన్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఘనంగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోలు సూర్య, విశాల్, ఆర్య, జయం రవి, దర్శకులు లోకేష్ కనకరాజ్, పా. రంజిత్ తదితరులు హాజరయ్యారు.

జపాన్ ట్రయిలర్ చాలా కొత్తగా ఉంది. కథ సింపుల్ అనిపిస్తున్నప్పటికీ, దాని సెటప్, నేపథ్యం అంతా కొత్తగా ఉంది. కార్తీ క్యారెక్టరైజేషన్ చాలా యూనిక్ గా ఉంది. డిఫరెంట్ మేనరిజమ్స్ తో కార్తి ఎట్రాక్ట్ చేశాడ. మరీ ముఖ్యంగా ట్రయిలర్ లో అతడు చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి.

కార్తి ఇష్టపడే అమ్మాయి పాత్రలో అను ఇమ్మాన్యుయేల్ నటించింది. ట్రైలర్‌లో సునీల్, విజయ్ మిల్టన్, తదితరులు పోషించిన ఇతర ముఖ్యమైన పాత్రలను కూడా చూపించారు. ఎస్ రవి వర్మన్ క్యాప్చర్ చేసిన విజువల్స్ బాగున్నాయి. జివి ప్రకాష్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ ని మరింతగా ఎలివేట్ చేసింది. ఈ దీపావళికి జపాన్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది.

First Published:  29 Oct 2023 3:22 PM GMT
Next Story