Telugu Global
Cinema & Entertainment

Karthi: కార్తి హీరోగా 'జపాన్' మూవీ

కార్తి కెరీర్ లో ప్రతిష్ఠాత్మక మూవీ లాంచ్ అయింది. ఈ మూవీ కార్తీ కి 25వ సినిమా. మూవీ పేరు జపాన్.

Karthi: కార్తి హీరోగా జపాన్ మూవీ
X

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, విలక్షణమైన పాత్రలు ఎంచుకంటూ దూసుకుపోతున్న కార్తి మరో సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా పేరు జపాన్. ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. కార్తి కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రం ఇది.


డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. ఇంతకుముందు ఈ బ్యానర్ పై ఖైదీ, సుల్తాన్ లాంటి 5 హిట్ సినిమాలు చేశాడు కార్తి. జపాన్ మూవీ.. వీళ్ల కాంబోలో ఆరో సినిమా. ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఈ సినిమాకు నిర్మాతలు. రాజు మురుగన్ 'జపాన్' కు దర్శకుడు.


ఈ చిత్రంలో తొలిసారిగా కార్తి సరసన అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తోంది. అల్లు అర్జున్ 'పుష్ప'లో 'మంగళం శీను' పాత్రలో ఆకట్టుకున్న సునీల్ 'జపాన్'లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంతో సునీల్ తమిళ్ లో డెబ్యూ ఇస్తున్నాడు.


విజయ్ మిల్టన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

First Published:  9 Nov 2022 1:28 PM GMT
Next Story