Telugu Global
Cinema & Entertainment

Bedurulanka | కార్తికేయ సినిమా ట్రయిలర్ రెడీ

Karthikeya Bedurulanka - బెదురులంక అనే సినిమా రెడీ చేశాడు కార్తికేయ. ఈ సినిమా ట్రయిలర్ రెడీ అయింది.

Bedurulanka | కార్తికేయ సినిమా ట్రయిలర్ రెడీ
X

లాంగ్ గ్యాప్ తర్వాత హీరో కార్తికేయ నుంచి మరో సినిమా రెడీ అయింది. దీని పేరు బెదురులంక. డీజే టిల్లూ బ్యూటీ నేహా శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ట్రయిలర్ కూడా రెడీ అయింది.

ఇండిపెండెన్స్ డే కానుకగా రేపు, బెదురులంక సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ ట్రయిలర్ తో సినిమా స్టోరీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2012లో యుగాంతం అయిపోతుందనే పుకార్లు వచ్చినప్పుడు, ఓ చిన్న గ్రామంలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

కార్తికేయ-నేహా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ఆగస్ట్ 25న రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఈ డిఫరెంట్ మూవీకి క్లాక్స్ దర్శకత్వం వహించాడు. లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బెన్నీ ఈ సినిమాను నిర్మించాడు. అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, సత్య, గోపరాజు రమణ, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీరామ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

First Published:  14 Aug 2023 2:59 AM GMT
Next Story