Telugu Global
Cinema & Entertainment

Bedurulanka: కార్తికేయ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

Karthikeya Bedurulanka: స్మాల్ గ్యాప్ తర్వాత కార్తికేయ మరో సినిమా రెడీ చేశాడు. ఆ మూవీ ఫస్ట్ లుక్ ను నాని రిలీజ్ చేశాడు.

Bedurulanka: కార్తికేయ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
X

కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా 'బెదురులంక 2012'. ఇందులో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని ఈ రోజు 'బెదురులంక 2012' ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేశాడు.

మోషన్ పోస్టర్ చూస్తే 'బెదురులంక 2012' ఎంత విభిన్నంగా ఉండబోతుందనే విషయం అర్థమౌతుంది. ఒక పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో తీసిన చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్. కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందంటున్నారు మేకర్స్.

'డీజే టిల్లు' తర్వాత నేహా నటిస్తున్న చిత్రమిది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఇందులో 5 పాటలున్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ దీనికి సంగీత దర్శకత్వం వహించారు. స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ సినిమాలో ఓ పాట రాశారు.

డ్రామా, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ సినిమాలో మెయిన్ హైలైట్స్ అవుతాయంటున్నారు దర్శకనిర్మాతలు. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.



First Published:  30 Nov 2022 10:46 AM GMT
Next Story