Telugu Global
Cinema & Entertainment

Bedurulanka 2012 - బెదురులంక సినిమాకు విడుదల తేదీ ఫిక్స్

Karthikeya's Bedurulanka 2012 - లాంగ్ గ్యాప్ తర్వాత ఎట్టకేలకు మరో సినిమా సిద్ధం చేశాడు కార్తికేయ. ఈ సినిమా పేరు బెదురులంక.

Bedurulanka 2012 - బెదురులంక సినిమాకు విడుదల తేదీ ఫిక్స్
X

కార్తికేయ హీరోగా నటించిన సినిమా 'బెదురులంక 2012'. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై బెన్నీ నిర్మిస్తున్నాడు. క్లాక్స్ దర్శకుడు. ఇందులో కార్తికేయ సరసన 'డీజే టిల్లూ' ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే విడుదల అయిన 'ద వరల్డ్ ఆఫ్ బెదురులంక' గ్లింప్స్, ‘వెన్నెల్లో ఆడపిల్ల’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

గోదావరి ఒడ్డున ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో తీసిన సినిమా ఇది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించే కొత్త తరహా డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. కార్తికేయ, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ అంటున్నారు.

First Published:  7 July 2023 4:56 PM GMT
Next Story