Telugu Global
Cinema & Entertainment

ఈ సినిమా ఓటీటీలో కూడా సూపర్ హిట్

నిఖిల్ హీరోగా నటించిన సినిమా కార్తికేయ 2. తాజాగా ఈ సినిమా ఓటీటీలో కూడా పెద్ద హిట్టయింది.

ఈ సినిమా ఓటీటీలో కూడా సూపర్ హిట్
X

లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా రిలీజ్ చేసిన నిఖిల్. అనుకున్నది సాధించాడు. కార్తికేయ-2తో సూపర్ హిట్ కొట్టాడు. నార్త్ లో కూడా హిట్టవ్వడంతో, ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు నిఖిల్.

అయితే కార్తికేయ2 ప్రభంజనం ఇక్కడితో ఆగిపోలేదు. ఈ సినిమా హవా ఓటీటీలో కూడా కొనసాగింది. దసరా కానుకగా జీ5 యాప్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన కార్తికేయ-2, నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. స్ట్రీమింగ్ కు వచ్చిన 2 రోజుల్లోనే 100 కోట్ల నిమిషాల వీక్షణలు అందుకుంది.

ఈమధ్య కాలంలో ఈ స్థాయిలో ఓటీటీలో సక్సెస్ అయిన సినిమా ఇంకోటి లేదు. రీసెంట్ గా ఆచార్య, రాధేశ్యామ్, భీమ్లానాయక్ లాంటి పెద్ద సినిమాలు వచ్చినప్పటికీ, స్ట్రీమింగ్ అయిన 2 రోజుల్లోనే ఈ స్థాయిలో వాటికి ఆదరణ దక్కలేదు. అది కేవలం కార్తికేయ2తోనే సాధ్యమైంది.

కృష్ణతత్వానికి ట్రెజర్ హంట్ కాన్సెప్ట్ యాడ్ చేసి తీసిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. చందు మొండేటి దర్శకత్వం వహించాడు.

First Published:  9 Oct 2022 8:30 AM GMT
Next Story