Telugu Global
Cinema & Entertainment

Karthikeya | లాంగ్ గ్యాప్ తర్వాత మరో మూవీ

Karthikeya - లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి తెరపైకొస్తున్నాడు కార్తికేయ. అతడి కొత్త సినిమా సంగతులు రేపు బయటకు రాబోతున్నాయి. ఈరోజు ప్రీ-లుక్ రిలీజ్ చేశారు.

Karthikeya | లాంగ్ గ్యాప్ తర్వాత మరో మూవీ
X

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో హీరో కార్తికేయ గుమ్మకొండ ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీడేస్ రాహుల్ టైసన్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అజయ్ కుమార్ రాజు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇవాళ ఈద్ పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేశారు. రేపు మధ్యాహ్నం 12.06 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రీ లుక్ ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంటోంది. కార్తికేయ నటిస్తున్న 8వ చిత్రమిది. న్యూ కాన్సెప్ట్ బేస్డ్ గా రూపొందుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.

తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు రథన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఇతడు పాటల వరకు మాత్రమే పరిమితం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం కపిల్ కుమార్ ను తీసుకున్నారు.




First Published:  11 April 2024 3:56 PM GMT
Next Story