Telugu Global
Cinema & Entertainment

Karthikeya 3 Movie: 3డీ ఫార్మాట్ లో కార్తికేయ-3.. నిఖిల్ ఆసక్తికర అప్డేట్

karthikeya 3 Movie: కార్తికేయ- 3 కి సంబంధించి కీలక అప్డేట్ వెల్లడించాడు. ఈ సినిమాను 3డీ ఫార్మాట్లో తెరకెక్కించనున్నట్లు తెలిపాడు. కార్తికేయ-3 కి సంబంధించిన మరికొన్ని విషయాలు అతి త్వరలోనే వెల్లడిస్తామని చెప్పాడు.

Karthikeya 3 Movie
X

Karthikeya 3 Movie: 3డీ ఫార్మాట్ లో కార్తికేయ-3.. నిఖిల్ ఆసక్తికర అప్డేట్

టాలీవుడ్ లో సొంతంగా పైకి వచ్చిన హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్ ఒకడు. హ్యాపీడేస్ సినిమాతో ఒక హీరోగా పరిచయమైన నిఖిల్ ఆ తర్వాత సినిమా కష్టాలు చాలానే ఎదుర్కొన్నాడు. వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వస్తూ తనకంటూ ప్రేక్షకుల్లో ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. నిఖిల్ కు బాగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా కార్తికేయ. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2014లో విడుదలై బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ ఏడాది వచ్చిన కార్తికేయ- 2 ఒక్క తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా సంచలన విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కార్తికేయ- 2 క్లైమాక్స్ లో కార్తికేయ- 3 సినిమా కూడా ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. నిఖిల్ తాజాగా 18 పేజెస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిఖిల్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో చాట్ చేశాడు.

ఈ సందర్భంగా కార్తికేయ- 3 కి సంబంధించి కీలక అప్డేట్ వెల్లడించాడు. ఈ సినిమాను 3డీ ఫార్మాట్లో తెరకెక్కించనున్నట్లు తెలిపాడు. కార్తికేయ-3 కి సంబంధించిన మరికొన్ని విషయాలు అతి త్వరలోనే వెల్లడిస్తామని చెప్పాడు. కార్తికేయ తొలి రెండు భాగాలు సూపర్ హిట్ కావడంతో మూడో భాగాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఇక తాజాగా 3డీ వెర్షన్ లో కూడా మూవీ ఉంటుందని నిఖిల్ వెల్లడించడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. నిఖిల్ ప్రస్తుతం స్పై అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత కార్తికేయ-3 మొదలుకానుంది.

First Published:  27 Dec 2022 2:53 PM GMT
Next Story