Telugu Global
Cinema & Entertainment

కార్తికేయ 2 ట్రయిలర్ రెడీ

నిఖిల్ హీరోగా నటించిన సినిమా కార్తికేయ 2. ఇప్పటికే ఓ ట్రయిలర్ రిలీజైంది. ఇప్పుడు రెండో ట్రయిలర్ రెడీ అయింది.

కార్తికేయ 2 ట్రయిలర్ రెడీ
X

నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కార్తికేయ‌ 2. ఇప్పటికే విడుదలైన ట్రైలర్-1 కు మంచి స్పందన వచ్చింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

'శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం' అంటూ అదిరిపోయే డైలాగ్స్ తో సాగే ట్రైలర్-1 ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 6న కార్తికేయ 2 థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ట్రైలర్-1తో ఈ సినిమా పై వచ్చిన అంచనాలకు మించే స్థాయిలో రాబోయే థియేట్రికల్ ట్రైలర్ ఉంటుందని యూనిట్ చెబుతోంది. ఇక కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఇక సినిమాటోగ్రఫర్ కార్తికే ఘట్టమనేని, ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ను చక్కగా చూపించాడట.

చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకు సీక్వెల్‌గా వస్తోంది కార్తికేయ 2. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంట‌గా న‌టిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం. శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎంట‌ర‌వుతూ క‌నిపిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 12న విడుదల కానుంది కార్తికేయ 2.

First Published:  2 Aug 2022 9:12 AM GMT
Next Story