Telugu Global
Cinema & Entertainment

ఓవర్సీస్ లో దుమ్ముదులుపుతున్న కార్తికేయ2

నిఖిల్ హీరోగా నటించిన సినిమా కార్తికేయ2. ఓవర్సీస్ లో ఈ సినిమా మిలియన్ మార్క్ కు దగ్గరైంది.

ఓవర్సీస్ లో దుమ్ముదులుపుతున్న కార్తికేయ2
X

నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా డొమస్టిక్ గా ఎంత పెద్ద హిట్టయిందో, ఓవర్సీస్ లో కూడా అంతే పెద్ద విజయాన్ని నమోదు చేసింది. రోజురోజుకు ఈ సినిమా వసూళ్లు పెరుగుతున్నాయి. అలా మిలియన్ మార్క్ కు దగ్గరగా చేరింది కార్తికేయ సినిమా.

ఓవర్సీస్ లో ఈ సినిమాకు ఇప్పటివరకు 9 లక్షల డాలర్ల వసూళ్లు వచ్చాయి. మరో లక్ష డాలర్ల కలెక్షన్ వస్తే ఈ సినిమా మిలియన్ క్లబ్ లోకి ఎంటరవుతుంది. ఈరోజు లేదా రేపటికల్లా కార్తికేయ2 సినిమా ఈ ఘనత సాధిస్తుంది.

నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కింది కార్తికేయ2 సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా.. నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు, నిఖిల్ కు నార్త్ బెల్ట్ లో తొలిసారిగా స్థానం కల్పించింది కూడా ఈ సినిమానే.

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రచారం పూర్తిచేసిన నిఖిల్, ఇప్పుడు ఉత్తరాదిన పర్యటిస్తున్నాడు. ఢిల్లీ, ముంబయి, ఆగ్రా లాంటి కీలకమైన ప్రాంతాల్లో కార్తికేయ2 సినిమాకు విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాడు. కృష్ణ తత్వాన్ని వివరిస్తూ, ట్రెజర్ హంట్ ఫార్ములాతో వచ్చిన ఈ సినిమా అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

First Published:  21 Aug 2022 6:37 AM GMT
Next Story