Telugu Global
Cinema & Entertainment

మరోసారి వాయిదాపడిన నిఖిల్ సినిమా

లెక్కప్రకారం 12న రిలీజ్ అవ్వాలి కార్తికేయ-2. ఇప్పుడీ సినిమా ఒక రోజు ఆలస్యంగా వస్తోంది.

మరోసారి వాయిదాపడిన నిఖిల్ సినిమా
X

జులై 22 అనుకున్నారు. తర్వాత ఆగస్ట్ 5 అన్నారు, ఆ తర్వాత ఆగస్ట్ 12కు మార్చారు. ఇలా రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంటూ వస్తున్న కార్తికేయ-2 యూనిట్, ఇప్పుడు మరోసారి వాయిదా మంత్రం జపించింది. కార్తికేయ-2 సినిమా మరోసారి వాయిదా పడింది. 12వ తేదీన కాకుండా, ఒక రోజు ఆలస్యంగా 13వ తేదీన విడుదలవుతుంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్ పై నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వస్తున్నప్పటికీ, గత చిత్రానికి దీనికి సంబంధం ఉండదని దర్శకుడు చందు మొండేటి క్లారిటీ ఇచ్చాడు.

కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటుచేసింది యూనిట్. యూనిట్ లో కీలక సభ్యులంతా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రయిలర్-2పై మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆగస్ట్ 6న కార్తికేయ 2 కొత్త ట్రయిలర్ రిలీజ్ అవుతుంది. అక్కడ్నుంచి మరో 5 రోజుల పాటు సినిమా ప్రచారం కోసం వినూత్న కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

ఇదే కార్యక్రమంలో ఓటీటీ రిలీజ్ పై కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. విడుదలైన తర్వాత 50 రోజుల పాటు ఈ సినిమా ఓటీటీలోకి రాదని, కాబట్టి అంతా థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరారు. పైగా, కార్తికేయ-2ను థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం తీశామంటున్నాడు హీరో నిఖిల్.

Next Story