Telugu Global
Cinema & Entertainment

వంద కోట్ల క్లబ్ లోకి చేరిన కార్తికేయ 2

నిఖిల్ హీరోగా నటించిన సినిమా కార్తికేయ2. ఇప్పుడీ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది.

వంద కోట్ల క్లబ్ లోకి చేరిన కార్తికేయ 2
X

నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ-2 సినిమా మరో అరుదైన ఘనత దక్కించుకుంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. అవును.. నిన్నటి వసూళ్లతో కలిపి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈ సినిమా ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందని యూనిట్ కూడా భావించలేదు. నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ.

నార్త్ బెల్ట్ లో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలై ఇన్ని రోజులైనప్పటికీ, నిన్నటికి నిన్న వర్కింగ్ డే (వీకెండ్ కాదు) అయినప్పటికీ.. ఈ సినిమాకు ఉత్తరాదిన 89 లక్షల రూపాయల నెట్ రావడం విశేషం. ఈ శనివారం, ఆదివారం సినిమాకు ఉత్తరాదిన మరిన్ని వసూళ్లు వస్తాయని ట్రేడ్ అంచనా వేస్తోంది.

వంద కోట్ల క్లబ్ లో చేరిన ఆనందాన్ని ప్రేక్షకులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటోంది యూనిట్. ఈరోజు కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నారు. సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు మరోసారి థ్యాంక్స్ చెబుతున్నారు.

చందు మొండేటి దర్శకత్వంలో వచ్చింది కార్తికేయ2. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

First Published:  26 Aug 2022 2:39 PM GMT
Next Story