Telugu Global
Cinema & Entertainment

హిందీలో ఊహించని రేంజ్ లో కార్తికేయ -2 కలెక్షన్స్..!

కార్తీకేయ-2 థియేటర్ల సంఖ్య అలా పెంచారో లేదో ఇలా బుక్ అయిపోయాయి. బుక్ మై షో వంటి యాప్స్ లో కార్తికేయ-2 ఆడుతున్న థియేటర్లు హౌస్ ఫుల్ అయినట్లు చూపుతున్నాయి.

హిందీలో ఊహించని రేంజ్ లో కార్తికేయ -2 కలెక్షన్స్..!
X

ఎనిమిదేళ్ల కిందట బ్లాక్ బాస్టర్ గా నిలిచిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ-2 మూవీ కూడా దేశ వ్యాప్తంగా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. తెలుగులో ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉండగా.. హిందీలో ఎటువంటి అంచనాలు లేకుండానే విడుదల అయ్యింది. మొదటి రోజు నార్త్ లో ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల వద్ద జనం పెద్దగా కనిపించలేదు. అయితే సినిమా బాగుందని మౌత్ టాక్ రావడంతో ఈ మూవీ చూసేందుకు అక్కడి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. వీకెండ్ అయిన శనివారం ఈ మూవీ నార్త్ లో రూ.7 లక్షల వసూళ్లు సాధించగా, ఆదివారం రూ. 28 లక్షల కలెక్షన్స్ అందుకుంది.

సోమవారం ఏకంగా రూ. 1.10 కోట్ల వసూళ్లను అందుకొని ఔరా అనిపించింది. ఎటువంటి ప్రమోషన్స్ చేపట్టకుండానే కార్తికేయ-2 హిందీ వెర్షన్ కలెక్షన్స్ రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హాలిడే రావడంతో ఈ సినిమాను ఏకంగా 2500 నుంచి 3000 థియేటర్లలో ప్రదర్శించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేశారు. కార్తీకేయ-2 థియేటర్ల సంఖ్య అలా పెంచారో లేదో ఇలా బుక్ అయిపోయాయి. బుక్ మై షో వంటి యాప్స్ లో కార్తికేయ-2 ఆడుతున్న థియేటర్లు హౌస్ ఫుల్ అయినట్లు చూపుతున్నాయి.

నార్త్ లో ఈ సినిమా విడుదల అయిన రోజు కేవలం 53 షోలు మాత్రమే వేయగా.. ప్రస్తుతం 2500 నుంచి 3000 షోలు వేసే స్థాయికి వెళ్లడం చూస్తుంటే కార్తికేయ-2 హిందీ వారిని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటోందో అర్థం అవుతోంది. నార్త్ లో ఈ మూవీకి దక్కుతున్న ఆదరణను చూసి హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చిత్ర యూనిట్ ఇవాళ ఢిల్లీలో ప్రమోషన్స్ ప్రారంభించింది.

Next Story