Telugu Global
Cinema & Entertainment

కార్తికేయ2 మొదటి రోజు వసూళ్లు

నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ-2 సినిమా సూపర్ హిట్టయింది. మొదటి రోజు వసూళ్లలో నిఖిల్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది ఈ మూవీ.

కార్తికేయ2 మొదటి రోజు వసూళ్లు
X

నిఖిల్ హీరోగా నటించిన సినిమా కార్తికేయ-2. సినిమాకు ప్రచారమైతే గట్టిగా చేశారు కానీ, భారీ సంఖ్యలో థియేటర్లు మాత్రం దక్కించుకోలేకపోయింది యూనిట్. దీనికి కారణం మాచర్ల నియోజకవర్గం. ఒక రోజు ముందు రిలీజైన మాచర్ల నియోజకవర్గానికి తెలుగు రాష్ట్రాల్లో 620కి పైగా స్క్రీన్లు దొరికాయి. అదే టైమ్ లో కార్తికేయ 2 సినిమాకు 450 పైచిలుకు స్క్రీన్స్ మాత్రమే దక్కాయి.

ఇలా తక్కువ స్క్రీన్స్ లో విడుదలైనప్పటికీ తన సత్తా చాటింది కార్తికేయ2 సినిమా. తొలి రోజు ఈ సినిమాకు ఏకంగా 5 కోట్ల 30 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. షేర్ లెక్కన చూసుకుంటే ఈ మొత్తం అటుఇటుగా 3 కోట్ల 50 లక్షల రూపాయలు. ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూసుకుంటే తొలిరోజు 30శాతం బ్రేక్ ఈవెన్ సాధించింది కార్తికేయ 2 సినిమా.

ఈ సినిమా వసూళ్లతో తన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు నిఖిల్. ఇప్పటివరకు ఈ హీరో కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ కిరాక్ పార్టీ మాత్రమే. ఆ స్థానాన్ని కార్తికేయ-2 భర్తీ చేసింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, పంద్రాగస్ట్ వీకెండ్ కూడా కలిసిరావడంతో.. కార్తికేయ-2 సినిమా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

కార్తికేయ-2 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం - 1.24 కోట్లు

సీడెడ్ - 40 లక్షలు

ఉత్తరాంధ్ర - 45 లక్షలు

ఈస్ట్ - 33 లక్షలు

వెస్ట్ - 20 లక్షలు

గుంటూరు - 44 లక్షలు

కృష్ణా - 27 లక్షలు

నెల్లూరు - 17 లక్షలు

First Published:  14 Aug 2022 12:34 PM GMT
Next Story