Telugu Global
Cinema & Entertainment

కార్తికేయ 2.. హిందీలో రూ.30 కోట్లు

నార్త్ బెల్ట్ లో కార్తికేయ 2 సూపర్ హిట్టయింది. తాజా వసూళ్లతో ఈ సినిమా హిందీ వెర్షన్ వసూళ్లు 30 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.

కార్తికేయ 2.. హిందీలో రూ.30 కోట్లు
X

నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా నార్త్ బెల్ట్ లో కూడా సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ ఎలాంటి పోటీ లేకుండా దూసుకుపోయింది ఈ సినిమా. లాల్ సింగ్ చడ్డా కూడా ప్లాప్ అవ్వడం, కార్తికేయ 2కు బాగా కలిసొచ్చింది. అయితే ఈసారి మాత్రం కార్తికేయ2కు నార్త్ నుంచి గట్టిపోటీ తప్పకపోవచ్చు.

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా బ్రహ్మాస్త్ర సినిమా విడుదలవుతోంది. రియల్ లైఫ్ కపుల్ రణబీర్ కపూర్, అలియాభట్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఉత్తరాదిన అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఒక్క పీవీఆర్ చెయిన్ లోనే లక్షకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి.

ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే, ఉత్తరాదిన కార్తికేయ2 రన్ ముగిసినట్టే. అయితే నిఖిల్ సినిమాకు ఇదేమంత ప్రమాదం కాదు. ఎందుకంటే, ఇప్పటికే ఈ సినిమా నార్త్ బాక్సాఫీస్ నుంచి ఎంత రాబట్టాలో అంతా సంపాదించుకుంది. ఇప్పటికే 30 కోట్ల రూపాయల నెట్ సాధించింది.

కాబట్టి బ్రహ్మాస్త్ర హిట్ అయినా, ఫ్లాప్ అయినా కార్తికేయ2కు పెద్దగా ఒరిగేదేం లేదు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు ఇంకా ఆక్యుపెన్సీ కొనసాగుతోంది. గత వారం విడుదలైన సినిమాలన్నీ వేటికవే నిరాశపరచడంతో.. కార్తికేయ2కు బోనస్ గా మరో వారం కలిసొచ్చింది.

First Published:  6 Sep 2022 11:19 AM GMT
Next Story