Telugu Global
Cinema & Entertainment

శర్వానంద్ కోసం పాట పాడిన కార్తి

శర్వానంద్ కోసం కార్తి ఓ పాట పాడాడు. ఒకే ఒక జీవితం సినిమా కోసం పాడిన ప్రమోషనల్ సాంగ్ ఇది

శర్వానంద్ కోసం పాట పాడిన కార్తి
X

శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం 'ఒకే ఒక జీవితం'. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.

మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటివలే విడుదలైన ''ఒకటే కదా'' పాట సూపర్ హిట్ అయ్యింది. అన్నీ మ్యూజిక్ వేదికలపై ట్రెండింగ్ లో నిలిచింది. తాజాగా ఈ చిత్రం నుండి ''మారిపోయే'' అనే పాటని విడుదల చేశారు. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే హీరో కార్తీ స్పెషల్ ఎప్పిరియన్స్ లో కనిపించి, స్వయంగా ఆయనే పాడి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. 'నేనే పాడుతున్నా'' అంటూ తనదైన శైలిలో అభిమానులని, ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాడు కార్తీ.

జేక్స్ బిజోయ్ ఈ పాట కోసం ట్రెండీ క్యాచి ట్యూన్ ని కంపోజ్ చేయగా, పాటకు కృష్ణచైతన్య అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ముఖ్యంగా కార్తి ఈ పాటని ఎనర్జిటిక్ గా పాడిన విధానం ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు సర్ ప్రైజ్ లు ఉంటానని చిత్ర యూనిట్ ఇంతకుముందే చెప్పింది. చెప్పినట్లే కార్తి పాటతో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం తమిళంలో 'కణం' పేరుతో ఏకకాలంలో విడుదల కానుంది.



First Published:  26 Aug 2022 2:46 PM GMT
Next Story