Telugu Global
Cinema & Entertainment

సర్దార్.. ఓ ఇండియన్ స్పై థ్రిల్లర్

కార్తి హీరోగా నటించిన తాజా చిత్రం సర్దార్. ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు ఈ హీరో. మరి సర్దార్ గురించి కార్తి ఏమంటున్నాడు?

సర్దార్.. ఓ ఇండియన్ స్పై థ్రిల్లర్
X

హీరో కార్తి, దర్శకుడు పిఎస్ మిత్రన్‌ ల లేటెస్ట్ మూవీ 'సర్దార్'. తాజాగా ట్రైలర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసింది ఈ సినిమా. భారీగా అంచనాలు కూడా పెంచింది. అక్టోబర్ 21న దీపావళి స్పెషల్ గా థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తున్నాడు కార్తి. ఈ సినిమాను ఓ ఇండియన్ స్పై థ్రిల్లర్ గా చెబుతున్నాడు.

"ఇన్నాళ్లూ స్పై కథల్ని హాలీవుడ్ లోనే చూశాం. కానీ ఇది పూర్తిగా ఇండియన్ స్పై థ్రిల్లర్. ఇండియాలో నిజంగా జరిగిన కథ ఇది. దానికి కొంత ఫిక్షన్ జోడించి కథ రాసుకున్నాడు దర్శకుడు. ఇందులో కొన్ని ట్విస్టుల్ని దర్శకుడు చెబుతుంటే నాకు మతిపోయింది. మిత్రన్, రెండేళ్ల పాటు కష్టపడి ఈ కథ రాసుకున్నాడు."

ఇలా సర్దార్ సినిమాపై అంచనాలు పెంచేలా మాట్లాడాడు కార్తి. తన అన్న సూర్య టైపులో, ఇందులో రకరకాల గెటప్స్ లో కనిపించాడు కార్తి. దీనిపై కూడా స్పందించాడు.

అన్న సూర్య గెటప్స్ వేశాడని, తను సర్దార్ కోసం గెటప్స్ వేయలేదని.. నిజానికి ఇలా రకరకాల గెటప్స్ వేయడానికి తను పూర్తి వ్యతిరేకినని తెలిపాడు. కేవలం కథ డిమాండ్ చేసింది కాబట్టి అలా పలు గెటప్స్ లో కనిపించానని, లేకపోతే తను అస్సలు అంగీకరించేవాడ్ని కాదని అన్నాడు.

First Published:  18 Oct 2022 3:29 AM GMT
Next Story