Telugu Global
Cinema & Entertainment

తెలుగులో కాంతార సంచలనం

కన్నడలో సంచలన విజయం సాధించిన కాంతార సినిమా అదే పేరిట తెలుగులోకి డబ్ అయింది. నిన్న రిలీజైన ఈ సినిమా టాలీవుడ్ లో కూడా పెద్ద హిట్టయింది.

తెలుగులో కాంతార సంచలనం
X

హోంబలే ఫిలింస్ లో నిర్మించిన తాజా చిత్రం "కాంతార". ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది.

థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. "కాంతార" రిలీజైన మొదటి రోజే 5 కోట్లు గ్రాస్ సాధించింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో "కాంతార" క్లైమాక్స్ హాట్ టాపిక్ గా మారింది. చివరి 20 నిమిషాలు అరాచకం అంటున్నారు సినిమా చూసిన జనం. అప్పటివరకు మామూలుగా సాగుతున్న సినిమాను క్లైమాక్స్ లో వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. థియేటర్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడికి ఒళ్ళు గగుర్పొడిచేలా క్లైమాక్స్ ను మలిచాడు హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి.

First Published:  16 Oct 2022 1:26 PM GMT
Next Story