Telugu Global
Cinema & Entertainment

Kantara 2 Movie: కాంతార పార్ట్-2కు రంగం సిద్ధం

Kantara Movie Part 2 - దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన కాంతార సినిమాకు పార్ట్-2 రాబోతోంది. అయితే ఇది సీక్వెల్ మాత్రం కాదు.

Kantara 2 Movie: కాంతార పార్ట్-2కు రంగం సిద్ధం
X

Kantara 2 Movie: కాంతార పార్ట్-2కు రంగం సిద్ధం

దేశవ్యాప్తంగా సూపర్ హిట్టయింది కాంతార సినిమా. స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాకు దేశమంతా ఫిదా అయింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాతో రిషబ్ శెట్టి, నేషనల్ స్టార్ అయిపోయాడు.

ఇప్పుడు కాంతారకు పార్ట్-2 రాబోతోంది. అయితే ఇది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. అడవి, అందులో గ్రామం, మహారాజు, రాయి.. ఈ నేపథ్యంలో కాంతార ప్రీక్వెల్ సాగబోతోంది.

దీనికి సంబంధించి ఇప్పటికే పని మొదలుపెట్టాడు రిషబ్ శెట్టి. తన టీమ్ తో కలిసి లొకేషన్ల వేటలో పడ్డాడు. దట్టమైన అటవీ ప్రాంతాల్లో, వర్షాకాలంలో ఈ సినిమాను షూట్ చేయాలని నిర్ణయించాడు.

మరోవైపు హోంబలే ఫిలిమ్స్ కూడా ఈ సినిమాపై స్పందించింది. కాంతార ప్రీక్వెల్ రాబోతోందని, బడ్జెట్ కు లిమిట్ లేదని చెప్పేసింది.

కాంతారాలో అందరూ కన్నడ నటీనటులే కనిపించాడు. పాన్ ఇండియా లెవెల్లో హిట్టవ్వడంతో, కాంతార-2లో అన్ని భాషలకు చెందిన నటీనటుల్ని తీసుకుంటున్నారు.

First Published:  21 Jan 2023 1:09 PM GMT
Next Story