Telugu Global
Cinema & Entertainment

Kantara | కోర్టు కేసులు క్లియర్, సూపర్ హిట్ సాంగ్ రిలీజ్

Kantara - కోర్టు కేసుల్ని క్లియర్ చేసింది కాంతార యూనిట్. సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ను రిలీజ్ చేసింది.

Kantara 2 Movie: కాంతార పార్ట్-2కు రంగం సిద్ధం
X

Kantara 2 Movie: కాంతార పార్ట్-2కు రంగం సిద్ధం

కాంతార సినిమా పేరు చెప్పగానే, వరాహరూపం అనే సాంగ్ గుర్తొస్తుంది. భాషలకు అతీతంగా దేశవ్యాప్తంగా హిట్టయింది ఆ పాట. ఆ వెంటనే ఆ పాటపై కాపీరైట్ కూడా పడింది. తమ ట్యూన్ ను కాపీ చేశారంటూ కొందరు కాంతార సినిమాపై కేసు వేశారు. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఆ పాట లేకుండానే స్ట్రీమింగ్ నడిచింది.

ఎట్టకేలకు ఈ కేసు క్లియర్ అయింది. వరహరూపం పాటపై తమకు పూర్తి హక్కులున్నట్టు హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిరూపించుకుంది. కోర్టు కేసు కొట్టేయడంతో, ఫ్రెష్ గా ఆ పాటను మరోసారి సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. అంతేకాదు, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో కూడా యాడ్ చేయబోతున్నారు.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే, తాజాగా కాంతార సినిమా విడుదలై ఏడాది పూర్తి చేసుకుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా 400 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కల్ట్ స్టేటస్ అందుకుంది.

ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం కాంతార-2 కథపై కసరత్తు చేస్తున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ గ్యాప్ లో సలార్ సినిమాను విడుదల చేసి, ఫ్రీ అవుతారు హోంబలే నిర్మాతలు.

First Published:  1 Oct 2023 3:26 PM GMT
Next Story