Telugu Global
Cinema & Entertainment

కేజీఎఫ్2ను క్రాస్ చేసిన కాంతార

కన్నడనాట కాంతార సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేజీఎఫ్2 ను ఇది అధిగమించింది. ఈ మేరకు హోంబలే ఫిలిమ్స్ ప్రకటన విడుదల చేసింది.

కేజీఎఫ్2ను క్రాస్ చేసిన కాంతార
X

కన్నడనాట విడుదలై నెల రోజులైనప్పటికీ కాంతార హవా తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాకు స్టడీగా వసూళ్లు వస్తున్నాయి. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు కేజీఎఫ్-2ను కూడా క్రాస్ చేసింది.

తమ నిర్మాణ సంస్థ తీసిన సినిమాల్లో ఎక్కువ మంది కన్నడిగులు చూసిన సినిమాగా కాంతార రికార్డ్ సృష్టించిందని స్వయంగా హోంబలే ఫిలిమ్స్ సంస్థ ప్రకటించింది. అంటే దీనర్థం, కన్నడనాట కేజీఎఫ్2 ను కాంతర క్రాస్ చేసినట్టే.

కేజీఎఫ్2తో పోలిస్తే, చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కింది కాంతార సినిమా. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ చూసి జనాలు పిచ్చెక్కిపోతున్నారు. సినిమా ఇంత హిట్టవ్వడానికి కారణం చివరి 20 నిమిషాల ఎపిసోడ్.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంతర హవా కొనసాగుతోంది. దీపావళికి రిలీజైన 4 సినిమాల కంటే కాంతారకే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో పాతిక కోట్ల రూపాయల మార్క్ అందుకుంది ఈ మూవీ.

First Published:  25 Oct 2022 5:26 AM GMT
Next Story