Telugu Global
Cinema & Entertainment

Kannappa | కన్నప్ప షూటింగ్ అప్ డేట్స్

Kannappa - మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది

Kannappa | కన్నప్ప షూటింగ్ అప్ డేట్స్
X

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప. పురాణాల్లో చాలామంది చదువుకున్న భక్త కన్నప్ప చరిత్రకు ఇది దృశ్యరూపం. ఈ సినిమాను న్యూజిలాండ్ లో తీస్తున్నాడు నిర్మాత కమ్ హీరో మంచు విష్ణు. చాన్నాళ్ల పాటు న్యూజిలాండ్ లో ఉన్న ఈ నటుడు, తాజాగా సంక్రాంతి సంబరాల కోసం హైదరాబాద్ వచ్చాడు.

పండగ సందర్భంగా ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన మంచు విష్ణు, కన్నప్ప షూటింగ్ వివరాలు బయటపెట్టాడు. కన్నప్ప షూటింగ్ 60శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకా 40శాతం పెండింగ్ ఉంది. మిగిలిన భాగం షూటింగ్ కోసం వచ్చేనెలలో మరోసారి న్యూజిలాండ్ వెళ్లనుంది యూనిట్.

ఇక కన్నప్ప సినిమా రిలీజ్ పై కూడా స్పందించాడు విష్ణు. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేస్తామని, ఏ నెలలో రిలీజ్ చేస్తామనే విషయాన్ని మార్చి తర్వాత వెల్లడిస్తామన్నాడు. కన్నప్ప సినిమాకు భారీ గ్రాఫిక్స్ అవసరం అవుతాయి. ఆ గ్రాఫిక్ వర్క్ కొలిక్కి వచ్చేవరకు విడుదల తేదీ చెప్పడం మంచు విష్ణుకు ఇష్టం లేదు.

కన్నప్ప సినిమాలో చాలామంది స్టార్స్ నటిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 600 మంది ఈ సినిమా కోసం పని చేస్తున్నట్టు మంచు విష్ణు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

First Published:  14 Jan 2024 4:04 PM GMT
Next Story