Telugu Global
Cinema & Entertainment

Writer Padmabhushan - రైటర్ కు కన్నడ సూపర్ స్టార్ అభినందన

Writer Padmanabham - కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ప్రశంసలు అందుకున్నాడు రైటర్ పద్మనాభం. ఈ సినిమాను అంతా చూడాలని కోరుతున్నాడు.

Writer Padmabhushan - రైటర్ కు కన్నడ సూపర్ స్టార్ అభినందన
X

రైటర్ పద్మభూషణ్‌ చిత్ర యూనిట్ ను కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్ కుమార్ అభినందించారు. సుహాస్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించారు.

ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తాజాగా కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్ కుమార్.. రైటర్ పద్మభూషణ్‌ సినిమాతో పాటు సుహాస్‌, దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్‌, నిర్మాతలు అనురాగ్‌రెడ్డి, చంద్రూలపై ప్రశంసలు కురిపించారు.

"రైటర్ పద్మభూషణ్‌ సినిమాకి చాలా గొప్ప స్పందన వస్తోంది. ఇంత చక్కని సెన్సిబుల్ సినిమాకి ప్రేక్షకుల నుంచి అంతే గొప్ప స్పందన రావడం చాలా అనందంగా వుంది. ప్రివ్యూ షో గ్లింప్స్ చూశాను. ప్రేక్షుల నుంచి వచ్చిన స్పందన నా మనసుని హత్తుకుంది. అతి త్వరలోనే సినిమాని చూస్తాను. ఇంత చక్కటి సినిమాని అందించిన టీం అందరికీ అభినందనలు. సినిమా ఇంకా చూడని వారు.. ప్లీజ్ గో అండ్ వాచ్ రైటర్ పద్మభూషణ్’’ అని కోరారు శివరాజ్ కుమార్.

ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది ‘రైటర్ పద్మభూషణ్‌’. హీరో సుహాస్ కు హీరోగా ఇదే తొలి థియేట్రికల్ రిలీజ్.

First Published:  10 Feb 2023 3:10 PM GMT
Next Story