Telugu Global
Cinema & Entertainment

Indian 2 - ఇండియన్ 2 షూటింగ్ అప్ డేట్స్

Kamal Hassan's Indian 2 - తైవాన్ లో ల్యాండ్ అయ్యాడు 'భారతీయుడు'. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా.

Indian 2 - ఇండియన్ 2 షూటింగ్ అప్ డేట్స్
X

ఎన్నడూలేని విధంగా ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నాడు శంకర్. ఓవైపు రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తూనే, మరోవైపు ఇండియన్-2 సినిమాను కొనసాగిస్తున్నాడు. మొన్నటికిమొన్న గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి ఓ సాంగ్ షూట్ చేశారు. ఆ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ఇండియన్-2 స్టార్ట్ చేశాడు శంకర్.

ఇండియన్-2కు సంబంధించి తాజా అప్ డేట్ ఇచ్చాడు శంకర్. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను తైవాన్ లో స్టార్ట్ చేశారు. ఈ మేరకు తైవాన్ లో సీన్ పేపర్ చదువుతున్న ఫొటోను శంకర్ షేర్ చేశాడు. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్-2 సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ఆయన ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

తైవాన్ లో ఇండియన్-2కు సంబంధించి భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. విదేశీ ఫైట్ మాస్టర్ల ఆధ్వర్యంలో, భారీ బడ్జెట్ తో ఈ ఫైట్ ను కంపోజ్ చేయబోతున్నారు. కమల్ దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు.

కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఇండియన్-2లో రకుల్, సిద్దార్థ్, ప్రియాభవానీ శంకర్, బాబి సింహా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  2 April 2023 2:13 PM GMT
Next Story