Telugu Global
Cinema & Entertainment

Rajinikanth Kamal Hassan | రజనీపై కమల్ దే పైచేయి

Kamal Hassan Rajinikanth - ఎన్నో ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాలు థియేటర్లలో పోటీ పడ్డాయి. ఈసారి కమల్ దే పైచేయి.

Rajinikanth Kamal Hassan | రజనీపై కమల్ దే పైచేయి
X

సౌత్ ఇండియన్ సినిమాలో రీ-రిలీజ్ ట్రెండ్ కొంతకాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తమ పాత చిత్రాల రీ-రిలీజ్‌ల ద్వారా బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. కమల్ హాసన్ రీ-రిలీజ్ క్లాష్‌లో రజనీకాంత్‌ను ఓడించారు. కమల్ హాసన్ అభయ్ సినిమా, రజనీకాంత్ ముత్తు సినిమాలు 8వ తేదీన విడుదలయ్యాయి. తమిళనాడు థియేటర్లలో ముత్తుపై అభయ్ పైచేయి సాధించింది.

రెండు సినిమాల్ని పరిమిత స్క్రీన్లలో రీ-రిలీజ్ చేశారు. ఆక్యుపెన్సీ, అభిమానుల సంబరాలు, కలెక్షన్లను పోల్చి చూస్తే, కమల్ హాసన్ ఈసారి ఆధిపత్యం చెలాయించారు. తాజా లెక్కల ప్రకారం, ముత్తుకు వచ్చిన వసూళ్ల కంటే అభయ్ కు రెట్టింపు కలెక్షన్లు వచ్చాయి.

రజనీకాంత్, కమల్ హాసన్ 40 సంవత్సరాలకు పైగా వెండితెరపై తమ హవా కొనసాగిస్తున్నారు. కోలీవుడ్ లో వీళ్లకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి సినిమాల బాక్సాఫీస్ నంబర్లను కంపేర్ చేయడం అక్కడ సర్వసాధారణం. రీ-రిలీజ్ విషయంలో కూడా ఇప్పుడిదే కంపారిజన్ నడుస్తోంది.

చివరిసారిగా 2005లో రజనీకాంత్, కమల్ హాసన్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. రజనీకాంత్ చంద్రముఖి, కమల్ హాసన్ ముంబై ఎక్స్‌ప్రెస్ ఒకే రోజు విడుదలయ్యాయి. చంద్రముఖి ఇండస్ట్రీ హిట్ కాగా, ముంబై ఎక్స్ ప్రెస్ డిజాస్టర్ అయింది. 18 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద కమల్, రజనీ సినిమాలు ఢీకొట్టగా, ఈసారి రజనీపై కమల్ విజయం సాధించారు.

First Published:  11 Dec 2023 4:42 PM GMT
Next Story