Telugu Global
Cinema & Entertainment

Project K - ప్రభాస్ సినిమాలో కమల్ హాసన్

Kamal Haasan Project K - ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్-Kలోకి బిగ్ ఎట్రాక్షన్ వచ్చి చేరింది. కమల్ హాసన్ ఈ సినిమాలో నటించబోతున్నాడు.

Project K - ప్రభాస్ సినిమాలో కమల్ హాసన్
X

నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ K' అనౌన్స్ చేసినప్పటి నుంచి హెడ్ లైన్స్ లో నిలుస్తూ వస్తోంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ ప్రాజెక్టులోకి మరో పెద్ద స్టార్ వచ్చి చేరారు.

వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ కీలక పాత్ర పోషించబోతున్నాడు. కమల్ హాసన్ 'ప్రాజెక్ట్ కె'లో చేరడంతో ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ ఉన్న చిత్రంగా 'ప్రాజెక్ట్ కె' నిలిచింది. ఈ సినిమాలోకి అడుగుపెట్టడంపై కమల్ హాసన్ స్పందించారు.

“50 సంవత్సరాల క్రితం నేను డ్యాన్స్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నిర్మాణ రంగంలో అశ్వినీదత్ అనే పేరు పెద్దగా వినిపించింది. 50 ఏళ్ల తర్వాత మేమిద్దరం కలిసి వస్తున్నాం. ఈ చిత్రానికి నెక్స్ట్ జనరేషన్ బ్రిలియంట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నా సహనటులు మిస్టర్ ప్రభాస్, దీపిక కూడా ఆ తరం వారే. నేను ఇంతకుముందు అమిత్ జీ తో కలిసి పనిచేశాను. అయినా ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. అమిత్ జీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉన్నారు. నేను కూడా ఆ ప్రక్రియను అనుకరిస్తున్నాను."

దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్‌ తో ప్రపంచంతా ప్రాజెక్ట్-కె మార్మోగుతుందని, ప్రాజెక్ట్-కెకు సంబంధించి తనదే మొదటి ప్రశంస అని మెచ్చుకున్నారు కమల్ హాసన్.

First Published:  25 Jun 2023 1:13 PM GMT
Next Story